వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం

Fri,February 2, 2018 01:57 PM

cmkcr offers special pooja atmedaram sammaka sarakka


మేడారం: మేడారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్ వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి వనదేవతలకు సమర్పించారు. సీఎం కుటుంబసమేతంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు.


ప్రాజెక్టులకు ఆటంకాలు కలగొద్దని వేడుకున్నా..
తెలంగాణలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకాలు కలగొద్దని సమ్మక్క, సారలమ్మలను వేడుకున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇవాళ కుటుంబసమేతంగా వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం సమ్మక్క సారక్క అన్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు చెప్పారు. మేడారం జాతరలో సదుపాయాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.


మేడారంలో 200 ఎకరాల స్థలంలో శాశ్వత ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందని, 15 రోజుల్లో భూసేకరణపై మళ్లీ చర్చిస్తామన్నారు. జాతరను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరముందని సీఎం తెలిపారు. సమైక్యపాలనలో అన్ని నిర్లక్ష్యానికి గురైనట్లే సమ్మక్క జాతరను కూడా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని ప్రధానిని కోరతానన్నారు. ఆనాడు తెలంగాణ సిద్ధించాలని కోరుకునా. భవిష్యత్‌లో జాతరను చూసి అబ్బురపడేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

4430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles