ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్‌

Tue,August 6, 2019 04:30 PM

cmkcr offers pooja at dharmapuri laxmi narasimhaswamy temple


జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి దర్శనానంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీఎం కేసీఆర్ ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ తర్వాత ఎండో మెంట్ కమిషనర్ అనిల్ సీఎం కేసీఆర్ కు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం అందజేసి ఘనంగా సన్మానించారు.

సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, సుంకె రవికుమార్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, పలువురు నేతలు ఉన్నారు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles