స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై విస్తృత చర్చ

Mon,April 15, 2019 07:40 PM

CMKCR discuss on local bodies elections in TRS party meeting


హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించి..గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో అన్ని జడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని సూచనలు చేశారు.

ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles