ఆడపడుచులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం..

Tue,August 13, 2019 07:28 PM

cmkcr aim is provide economical support to ladies says errabelli

మహబూబాబాద్ జిల్లా: మహిళా సంఘాలను బలోపేతం చేసి.. తెలంగాణ ఆడపడుచులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్ మండల కేంద్రం శ్రీనివాస గార్డెన్స్ లో శ్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు మంత్రి ఎర్రబెల్లి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాలను ఏర్పాటు చేసి.. మహిళలను చైతన్య పర్చిన నాయకుడు ఎన్టీఆర్ అయితే... సంఘాలకు ఆర్థిక వనరులు అందించి భరోసా కల్పించిన మహానీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

లోన్ సురక్ష పథకం ప్రవేశపెట్టి సభ్యులకు భరోసా కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2011 నుండి 2019 వరకు 3 లక్షల 62వేల 387 గ్రూపులకు 8127.57 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో 8632 గ్రూపులకు 166.52 కోట్ల రుణాలు అందించారు. తొర్రూర్ మండలంలో 1081 గ్రూపులకు 27.85 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2019-20 వార్షిక ప్రణాళిక క్రింద తెలంగాణ రాష్ట్రంలో 2.50 లక్షల గ్రూపులకు 2900 కోట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో 2019-20 వార్షిక ప్రణాళిక క్రింద 4730 గ్రూపులకు 58.61 కోట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తొర్రూర్ మండలంలో 2019-20 వార్షిక ప్రణాళిక క్రింద 470 గ్రూపులకు 5.41 కోట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుంది. తొర్రూర్ పట్టణంలో 2019-20 వార్షిక ప్రణాళిక క్రింద 394 గ్రూపులకు 1.27 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని వివరించారు.

1561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles