25 మందికి సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ

Fri,June 22, 2018 07:52 PM

CM Relief cheques issued to 25 members in jayashankar bhupalapally dist

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 25 మందికి రూ.6.75 లక్షల విలువ గల చెక్కులు మంజూరు కాగా స్పీకర్ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS