ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

Sat,March 11, 2017 06:05 PM

CM KCR wrote a letter to the PM Modi

ఢిల్లీ: ఈవాళ వెలువడిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల బీజేపీ సాధించిన విజయంపై ప్రశంసిస్తూ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీని బలపరుస్తూ ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేసేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ విజయంతో దేశ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు అదేవిధంగా మరింత సమర్థంగా ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈవాళ వెల్లడైన ఫలితాలతో అభివృద్ధితోనే విజయం ఉంటుందని మరోసారి రుజువైందన్నారు.

1471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles