నేడు ప్రగతి సింగారానికి సీఎం కేసీఆర్

Wed,August 14, 2019 09:44 AM

CM  KCR will  visit Pragathi Singaram of Sayampet today

వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ బుధవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇటీవల పితృవియోగం పొందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పరామర్శించి, ఆయన తండ్రి దివంగత మల్లారెడ్డికి నివాళులర్పించనున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ హరిత, డీసీపీ నాగరాజు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు ధర్మారెడ్డిని పరామర్శించి మల్లారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles