చింతమడక గ్రామస్తులకు సీఎం కేసీఆర్‌ ఆప్యాయ పలకరింపు

Mon,July 22, 2019 01:09 PM

CM KCR visits Chintamadaka today

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చింతమడక చేరుకున్నారు. గ్రామంలోకి చేరుకున్న సీఎం కేసీఆర్‌ సభా వేదిక వద్దకు వెళ్లారు. ఆ తర్వాత స్టేజీ ఎక్కకుండానే నేరుగా జనాల్లోకి వెళ్లారు సీఎం. బాల్య స్నేహితులతో కేసీఆర్‌ ముచ్చటించారు. అనంతరం జనాల మధ్యలో తిరుగుతూ అందరితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పలువురు వినతులు అందజేశారు. చింతమడకకు సీఎం కేసీఆర్‌ రాకతో అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది. మరికాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles