22వ తేదీన చింతమడకకు సీఎం కేసీఆర్

Fri,July 19, 2019 08:48 PM

cm kcr tour to chintamadaka

సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకకు ఈ నెల 22వ తేదీన వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి గ్రామానికి వెళ్లిన సీఎం గ్రామానికి మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి గురించి చర్చించుకుందామని గ్రామస్తులకు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై సర్పంచ్‌కు ఫోన్‌లో సీఎం సూచనలు చేశారు. గ్రామస్థుల వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ఇప్పటికే రూ.10కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles