జగన్‌కే టీఆర్‌ఎస్‌ మద్దతు..!

Tue,February 12, 2019 11:36 AM

CM KCR To Appeal To Andhra Voters To Support Jagan Mohan Reddy Party

హైదరాబాద్‌ : త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి అబిద్‌ రసూల్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌కే ఓటేయాలని ఏపీ ప్రజలను తమ పార్టీ కోరనుందని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత లౌకికవాద, ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ లౌకికవాది మరియు పేదల ప్రజల స్నేహితుడు అని రసూల్‌ ఖాన్‌ చెప్పారు. ఆంధ్రాలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు, బంధువులు, వ్యాపార భాగస్వాములంతా వైసీపీకే ఓటేయాలని కోరుతామన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని రసూల్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

4163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles