దుఃఖం లేని తెలంగాణే నా లక్ష్యం : సీఎం కేసీఆర్

Wed,December 5, 2018 04:01 PM

CM KCR speech at TRS meeting in Gajwel

మెదక్ : దుఃఖం లేని తెలంగాణను చూడడమే నా లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గజ్వేల్ లో ఏర్పాటు చేసిన టీ ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చాలాచాలా కష్టపడి అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణను తెచ్చుకున్నాం. 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఎంతో క్షోభ అనుభవించి, త్యాగాల పునాదుల మీద 2014లో తెలంగాణను సాధించుకున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు.. గమనిస్తున్నారు. పోరాడి తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఏం కోరుతున్నాడు? పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి. దుఖం లేని తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం, కోటి ఎకరాలకు నీరు పారాలని యజ్ఞం చేస్తున్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొద్దు. గెలిచి నిలవాలి. ఓట్లు అంటేనే గాలి గాలి గత్తర కావొద్దు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగే ప్రయత్నంలో ఉంది. నేను పెట్టిన మొక్కలు పూత కాసి కాయ కాసే దశలో ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ కోరారు.

1403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles