రోజుకు 3 టీఎంసీలు తీసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టు

Mon,February 25, 2019 03:36 PM

CM KCR Speech At Telangana Assembly

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చివరి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ప్రకటించారని సీఎం కేసీఆర్‌ శాసనసభలో తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రానికి చాలాసార్లు లేఖలు, విజ్ఞప్తులు చేసినా ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదని వివరించారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు కోసం నేను, మా పార్టీ ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేశాం. కేంద్రం ఇవ్వకపోయినా.. ఐటీ రంగం విస్తరణ కోసం కృషి చేస్తున్నాం. టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఐటీ ఎగుమతులు రూ.50వేల కోట్ల నుంచి లక్ష కోట్లు దాటింది.

మొబిలైజేషన్‌ అడ్వాన్సులతో గుత్తేదారులకు దోచిపెట్టింది ఎవరో ప్రజలకు తెలుసు అని సీఎం అన్నారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు ఉన్న ఆయకట్టును కోల్పోయారు. మిషన్‌ కాకతీయ కింద 22వేల చెరువులను బాగు చేశాం. చిన్ననీటి వనరులు ధ్వంసమవుతుంటే కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోలేదు. సౌరవిద్యుత్‌ ఉత్పత్తి 5 వేల మెగావాట్లకు పైగా పెంచాం. సమైక్య రాష్ట్రంలో భయంకరమైన విద్యుత్‌ సమస్య ఉండేది. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎయిమ్స్‌ కోసం 270 ఎకరాల భూసేకరణ జరుగుతోందని కేసీఆర్‌ పేర్కొన్నారు.

పనులు జరగాలని కోరేది..కేసులు వేసి అడ్డుకునేది కాంగ్రెస్‌ వారే. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచితే కోర్టుకు వెళ్లింది కాంగ్రెస్‌ నేతలే. రిజర్వేషన్లు 50శాతం మించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పు ఇచ్చాయి. కాంగ్రెస్‌ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లలో బీసీలకు 50శాతం ఇచ్చింది టీఆర్‌ఎస్‌ మాత్రమే. బీసీలకు 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇది.


రోజుకు 3 టీఎంసీలు తీసుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు ఉన్న ఆయకట్టును కోల్పోయారు. మిషన్‌ కాకతీయ కింద 22వేల చెరువులను బాగు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును యథావిదిగా కొనసాగిస్తే తీవ్ర నష్టం జరిగేది. రాష్ట్రంలో, మహారాష్ట్రలో, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ సమస్య పరిష్కరించలేదు. ప్రాజెక్టు స్థలంలో తట్టెడు మట్టి తవ్వకుండానే చేవెళ్లలో కాలువలు తవ్వారు. గోదావరిలో గతేడాది 1470 క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. గోదావరి నుంచి 400 టీఎంసీల నీరు తీసుకునేలా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని కేసీఆర్‌ వివరించారు.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles