హామీలు 100 శాతం అమలు చేశాం : సీఎం కేసీఆర్

Mon,November 19, 2018 04:02 PM

cm kcr speech at Khammam TRS Meeting

ఖమ్మం : గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ సందర్భంలో చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను 100 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. డబుల్ బెడ్ ఇండ్లు కట్టిండ్రా? అని సొల్లు మాట్లాడుతుండ్రు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చిండ్రు అని అడుగుతుండ్రు. కాంగ్రెస్ టీడీపీలు కట్టినటువంటి ఏడు ఇండ్లకు ఒక డబుల్ బెడ్ ఇల్లు సమానం. ఎవరికి కూడా ఉచితంగా ఇండ్లు కట్టలేదు కాంగ్రెస్ హయాంలో. రూపాయి కూడా తీసుకోకుండా వంద శాతం సబ్సిడీతో ఇండ్లు కట్టిస్తున్నాం. ఆడవాళ్ల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఇండ్లు నిర్మిస్తున్నాం. ఆర్నేళ్లు ఆలస్యం కావొచ్చు కానీ.. ఒకసారి ఇల్లు వచ్చిందంటే 60 ఏండ్ల వరకు ఇల్లు లేదనే బాధ తీరిపోతుందన్నారు. ఇవాళ బరిలో ఉన్న పెద్దలు 58 ఏండ్లు పాలించారు. టీఆర్ఎస్ వచ్చింది 2014లో. కానీ ఈ నాలుగున్నరేండ్లలో అనేక సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశాం. అవకాశం ఉన్న కూడా అభివృద్ధి చేయలేదు వారు. రూ. 43 వేల కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

1705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles