రాష్ట్ర ప్రగతిలో ఉద్యోగులదే కీలక పాత్ర: కేసీఆర్Wed,May 16, 2018 10:15 PM

cm kcr speaks to media after meeting with employees union

హైదరాబాద్: రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లటంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల‌ సమస్యలపై సీఎం కేసీఆర్ మంత్రి వర్గ ఉపసంఘంతో ప్రగతి భవన్‌లో చర్చించారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడారు. "వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాం. రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్లు, ఉద్యోగుల విశేష కృషి ఉంది. దేశ స్థాయిలో రాష్ర్టానికి ఎంతో గౌరవం దక్కుతున్నది. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ వైద్యులపై 3 రెట్లు పని, బాధ్యత పెరిగింది. ప్రభుత్వ వైద్యుల సేవలను గుర్తించాల్సిందే. వారిని అభినందించాల్సిందే. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీలో ఉద్యోగులు సెలవులను కూడా త్యాగం చేసి పాల్గొన్నారు. 58 లక్షలమంది రైతులకు పాస్ పుస్తకాలు ముద్రించాలంటే సామాన్యమైన విషయం కాదు. రెవెన్యూ, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు రాత్రింబవళ్లు కృషి చేస్తేనే సాధ్యమయింది. ఉపాధ్యాయుల కృషి వల్ల ఈసారి మంచి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయుల కృషి వల్ల ఈసారి మంచి ఫలితాలు వచ్చాయి. ఉద్యోగుల సమష్టి కృషి వల్లే దేశమే ఆశ్చర్యపోయేలా ముందుకెళ్తున్నాం.." అని సీఎం తెలిపారు.

1839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS