కేసీఆరే లేకపోతే ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ దక్కేదా?

Sun,September 2, 2018 08:02 PM

హైదరాబాద్ : టీఆర్‌ఎస్సే లేకపోతే.. కేసీఆరే సీఎం కాకపోతే స్థానికులకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ దక్కేదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం కోసం ఢిల్లీలో పోరాటం చేశామన్నారు. ప్రధాని మోదీతో గొడవ పడి జోనల్ వ్యవస్థను సాధించుకున్నామని తెలిపారు సీఎం. కొత్త జోనల్ వ్యవస్థ మిగతా పార్టీ వాళ్లతో అయ్యేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను గద్దె దించడం కూడా ఒక లక్ష్యమేనా? అని అడిగారు. మోసపోతే గోసపడ్తామన్న కేసీఆర్.. కొన్ని పార్టీలు ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామనుకుంటున్నాయి. అధికారం మన దగ్గర ఉండాలా? ఢిల్లీకి చెంచాగిరి చేద్దామా? ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.

3919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles