నేను తెలంగాణ పిచ్చొడినే : సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 06:57 PM

CM KCR speaks at Pragathi Nivedana Sabha today

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు ఉన్నాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఏం చేయలేరనే అహంకారంతో ఢిల్లీ పెద్దలు ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని తెలిపారు. నాటి పాలకులు మనల్ని ఎగతాళి చేశారు.. అవహేళన చేశారని పేర్కొన్నారు. మీ అందరి దీవెనలతో 2001లో జలదృశ్యంలో తన ప్రయాణం మొదలైందన్నారు. చుట్టూ పిడికెడు మందితో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించాను. రాజకీయ పంథాలో వెళ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ కోసం ఒక్క కమ్యూనిస్టు పార్టీని ఒప్పించడానికి 38 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చాను అని గుర్తు చేశారు సీఎం. నువ్వు పిచ్చోనివా అని బర్దన్ అంటే.. అవును.. తాను తెలంగాణ పిచ్చోడినే అని అన్నానని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం 36 పార్టీలను ఒప్పించాను అని తెలిపారు. ఆ విధంగా సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని కాలరాసేందుకు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వాటన్నింటిని అధిగమించి.. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చానని సీఎం పేర్కొన్నారు.

3540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles