ఢిల్లీకి గులాములుగా ఉందామా.. సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 10:00 PM

cm kcr speaks at kongara kalan pragathi nivedana sabha

హైదరాబాద్: కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉందామని అంటున్నాయి. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండాలా? లేక ఢిల్లీలో ఉండాలా? తెలంగాణ ప్రజలు, కవులు, రచయితలు దయచేసి ఆలోచన చేయాలి. ఢిల్లీ పాలకుల కింద ఉండాలా? ఢిల్లీకి బానిసలం కావద్దు.. వాళ్లకు గులామ్‌లం కావద్దు.. అది భవిష్యత్తు తరాలకు మంచిది కాదు.. నిర్ణయాధికారం మన చేతిలో ఉండాలి.. అని సీఎం అన్నారు. కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభకు హాజరైన సీఎం ఈ సందర్భంగా ప్రసంగించారు.

హరీశ్ రావు కృషితో పాలమూరుకు మహార్ధశ
పాలమూరు జిల్లా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి పథకాలు 25 నుంచి 30 ఏండ్ల వరకు మూలుగుతుండెవని.. ఆ ప్రాజెక్టుల పనులు గత ప్రభుత్వాల హయాంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండేవని సీఎం అన్నారు. కానీ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ల‌క్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి తనతో కొట్లాడి మరీ డబ్బులు కేటాయించి ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కష్టపడి పనిచేసి పాలమూరు జిల్లాలో 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తీసుకొచ్చారని సీఎం తెలిపారు. పాలమూరు రైతులు హైదరాబాద్‌లో తమకు రేషన్ కార్డులు వద్దని.. పాలమూరులో ఇవ్వాలని ఎమ్మార్వోకు సరెండర్ చేస్తున్నారు. పాలమూరు వలసలు తగ్గి ఇప్పుడు అంతా మళ్లీ పాలమూరుకు పయనమవుతున్నారని సీఎం అన్నారు.

త్వరలో పించన్లు పెంచుకుందాం..
తెలంగాణ ఇప్పటికే వృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని.. ఇంకా ఆదాయం పెంచుకొని పించన్లు కూడా పెంచుకుందామని సీఎం స్పష్టం చేశారు. నిరుద్యోగ సోదరులను కూడా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

3215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles