ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

Mon,July 22, 2019 03:38 PM

CM KCR says congratulations to ISRO scientists

హైదరాబాద్‌ : చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల అనితర సాధ్యమైన కృషి వల్లే చంద్రయాన్‌-2 విజయవంతమైందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల కఠోర శ్రమను, ప్రతిభాపాటవాలను సీఎం కేసీఆర్‌ కొనియాడారు. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం 2:43 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 16 నిమిషాల 13 సెకన్ల పాటు జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ఎం1 ప్రయాణించింది. అనంతరం 39,059 కి.మీ. ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌-2ను వాహననౌక విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూనియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ప్రవేశించనుంది.

1019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles