ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

Sat,January 12, 2019 09:05 PM

CM KCR Review with senior officials on 15th Finance Commission

హైదరాబాద్: 15వ ఆర్థిక సంఘం రాష్ర్టానికి రానున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దిశలో అనుసరించాల్సిన విధానాలపై ఒకే సారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక విధానాల అమలు తీరులో గుణాత్మక మార్పు లేక ప్రజలు నిరాశకు గురవుతున్నారు. జనం అవసరాలు గుర్తించలేని కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో పనిచేస్తున్న రెండు రాజకీయ వ్యవస్థలు విఫలం అయ్యాయి. దేశానికి సంబంధించిన విస్తృతమైన విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉంది.

రాష్ర్టాలకు అప్పగించాల్సిన అధికారాలను కేంద్ర తన గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ర్టాల అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర విధానాలు ఉండకూడదని, అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవద్దని నీతి ఆయోగ్ కోసం జరిగిన సమావేశంలో సూచించాను. రాష్ర్టాల అభివృద్ధిని దేశ అభివృద్ధికి ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వం భావించాలి. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన కనీస సమన్వయం ఉండటం లేదు. కేంద్రం నుంచి రాష్ర్టాలకు అందాల్సిన వాటాల్లో వివక్ష ఉండటం దురదృష్టకరం. వివక్షపూరిత వైఖరితో కేంద్ర ప్రభుత్వాలు రాష్ర్టాలను అగౌరవపరుస్తున్నాయని పేర్కొన్నారు.

2308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles