యాదాద్రి అభివృద్ధి పనులపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

Sat,August 17, 2019 08:09 PM

cm kcr review meeting end on Yadadri development

యాదాద్రి భువనగిరి: యాదాద్రి అభివృద్ధి పనులపై హరిత అతిథిగృహంలో కొనసాగిన సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. యాదాద్రి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. అంతకుక్రితం ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి పనులను పరిశీలించిన సీఎం ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయడానికి ఇబ్బందులేమిటని ప్రశ్నించిన సీఎం పనుల వేగవంతం నిమిత్తం రూ. 50 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మరో పదిహేను రోజుల్లో రూ. 470 కోట్లు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. అదేవిధంగా వైటీడీఏకు ఆర్ అండ్ బీ నుంచి సీఈ స్థాయి అధికారిని డిప్యూటేషన్‌కు ఆదేశించారు. ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles