శ్రీధర్‌బాబు చెప్పింది అసత్యం : సీఎం కేసీఆర్‌

Sat,February 23, 2019 11:22 AM

CM KCR responds on MLA Sridharbabu comments on 24 hours power supply

హైదరాబాద్‌ : ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మహాదేవ్‌పూర్‌, కాటారం, పెద్దంపేట్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో 24 గంటల కరెంట్‌ సరఫరా కావడం లేదని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ.. శ్రీధర్‌బాబు గాలి మాటలు మాట్లాడిండు. 24 గంటల కరెంట్‌ సరఫరా విషయంలో ఆయన చెప్పింది అసత్యం. మహాదేవ్‌పూర్‌, కాటారం, పెద్దంపేట్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో గత 20 రోజుల రికార్డులు పరిశీలిస్తే 24 గంటల కరెంట్‌ సరఫరా అవుతోందని తేలిందన్నారు. అధికారులను సంప్రదించి, రికార్డులను చూసిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సాంకేతిక సమస్య వల్లే గంటో, అరగంటనో కరెంట్‌ పోతది. అది ముఖ్యమంత్రి ఇంట్ల కూడా జరుగుతది. అసత్యాలు చెప్పడం మంచిది కాదని శ్రీధర్‌బాబుకు కేసీఆర్‌ చురకలంటించారు.

3153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles