హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పద్యంతో అందరినీ అలంరించారు. తెలుగు మహాసభల వేడుకల ప్రారంభం సందర్భంగా ఒకట్రెండు పద్యాలు పాడి వినిపించిన సీఎం.. ముగింపు వేడుకల్లోనూ నవ్వుల పద్యం వినిపించి నవ్వులు పూయించారు. సంతోషమైన హృదయంతో.. నవ్వుతో.. తెలుగు మహాసభలను ముగిస్తున్నాం కాబట్టి.. నేను కూడా ఒక నవ్వుల పద్యంతో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను అని సీఎం అన్నారు. సీఎం కేసీఆర్ వల్లించిన పద్యం ఇదే..
నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్
దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసమున్ విరజిమ్ము విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషదుల్