నిజామాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

Tue,March 19, 2019 06:15 PM

cm kcr reached Nizamabad

నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ బహిరంగ సభ నేడు నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్‌కు చేరుకున్నారు. బహిరంగ సభకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ఎంపీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్ తో పాటు ఏడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నిజామాబాద్ వేదికగా రాష్ర్ట, జాతీయ రాజకీయాలపై మాట్లాడనున్నారు.

1790
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles