హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

Mon,May 27, 2019 01:38 PM

cm kcr reach to hyderabad from tirupathi

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరుపతి నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం కుటుంబసభ్యులకు నిన్న రాత్రి తిరుమల పద్మావతినగర్‌లోని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస ఏర్పాటుచేశారు.

ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆలయ వేదపండితులు ఆలయ మర్యదాల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ మహాద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు స్వామి వారి మూల విరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను కేసీఆర్ దంపతులకు అందజేశారు. సీఎం కేసీఆర్ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ప్రత్యేక పూజలు చేశారు.

2248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles