ఇది రాజకీయ పార్టీల కూటమి కాదు: కేసీఆర్

Wed,May 2, 2018 05:29 PM

cm kcr press meet with UP Former CM Akhilesh Yadav

హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. ఈసందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించడానికి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్, అఖిలేశ్ కొత్త రాజకీయ కూటమిపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన సీఎం.. దేశంలో పరివర్తన, గుణాత్మక మార్పు రావాలని.. దాని కోసం జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నానన్నారు. అఖిలేశ్ యాదవ్‌తో నెల రోజులుగా చాలా సార్లు మాట్లాడానని సీఎం స్పష్టం చేశారు. ఇది రాజకీయ పార్టీల కూటమి కాదని.. ఏళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయలేదన్నారు. దేశంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. దేశ రాజకీయాల్లో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని... ఆ మార్పు కోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. దానిపై అఖిలేశ్‌తో అన్ని విషయాలను మాట్లాడానని కేసీఆర్ స్పష్టం చేశారు.

3121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles