'కాంగ్రెస్ క్షుద్ర రాజ‌కీయాల‌ను ప్ర‌జల‌ముందు పెడ‌తా'

Wed,August 2, 2017 08:27 PM

CM KCR Press Meet in Pragathi bhavan, hyderabad and fires on congress

హైద‌రాబాద్: ఈ నెల 10 న ఎస్సారెస్పీ పున‌రుజ్జీవ‌న ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేసిన త‌ర్వాత రాష్ట్ర‌మంతా తిరుగుతాన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పుడు కాంగ్రెస్ క్షుద్ర రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌ల‌ముందే పెడ‌తాన‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ పిశాచి అని..న‌డిబ‌జార్ లో కాంగ్రెస్ దుర్నీతిని ఎండ‌గ‌డుతామ‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. ఆనాడు ఫ‌జ‌ర్ అలీ క‌మిష‌న్ వ‌ద్ద‌న్నా బ‌ల‌వంతంగా కాంగ్రెస్ నేత‌లు ఏపీలో క‌లిపార‌ని.. 1969 లో 400 మంది చావుల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ లో ఇక బ‌త‌క‌మ‌న్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్నిచ్చింద‌ని... అంతే కాని తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌తో కాదన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై స‌ల‌హాలివ్వ‌మంటే కాంగ్రేసోళ్లు పారిపోయార‌ని సీఎం అన్నారు. మూడేళ్ల నుంచి తాము నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తుంటే.. వాళ్లు మాత్రం సొల్లు పురాణం చెబుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తి విష‌యానికి స్పందిస్తే బాగోద‌ని వ‌దిలేస్తే... పిచ్చి కూత‌లు కూస్తున్నార‌న్నారు. మ‌నుషుల్లా కాకుండా.. ఉన్మాదుల్లా కాంగ్రెసోళ్లు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సీఎం పేర్కొన్నారు.

1335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles