గొంతెమ్మ కోరికలు కాదు.. చట్టబద్ధంగా రావాల్సినవే: సీఎం

Mon,August 13, 2018 07:54 PM

cm kcr press meet after trs party working committee meeting

హైదరాబాద్: తాము కేంద్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. "టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 9 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. మేం తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరతాం. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వనప్పటికీ రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. వరి, మొక్క ధాన్యాలకు మద్దతు ధర రూ. 2 వేల చొప్పున ఉండాలని కోరుతాం. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరతాం. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో నీతి సరైన పద్ధతి కాదు. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. తమిళనాడు రిజర్వేషన్లను 9 షెడ్యూల్‌లో చేర్చినట్లే తెలంగాణ రిజర్వేషన్లను కూడా చేర్చాలి.." అని సీఎం చెప్పారు.

3698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles