తెలంగాణ రైతులకు శుభవార్త..!

Fri,February 22, 2019 12:58 PM

CM KCR  presents vote-on-account budget in assembly

టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శాస‌న‌స‌భ‌లో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ ఇవాళ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన‌ తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు.

ఈసారి బడ్జెట్‌లో సాగునీటి రంగానికే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల హామీల అమలుతో పాటు సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు 2019-20 బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. రైతుల‌ రుణ‌మాఫీ అంశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తేదీని కటా‌‌‌‌‌ఫ్‌‌‌‌‌గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణమాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు రైతుల్లో నెల‌కొన్నాయి. తాజాగా రైతు రుణాలు మాఫీపై బ‌డ్జెట్‌లో సీఎం రైతులకు స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా రుణ‌మాఫీ చేయ‌నున్నారు.

రైతుల‌కు పెద్ద‌పీట‌..

రైతు బంధు పథకానికి రూ.12,000కోట్లు
రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు
మిషన్ కాకతీయకు(నీటిపారుద‌ల‌శాఖ‌) రూ.22,500కోట్లు
వ్యవసాయశాఖకు రూ.20,107 కోట్లు

8927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles