రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్‌

Fri,February 22, 2019 01:14 PM

CM KCR presented budget in telangana assembly

హైదరాబాద్‌ : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగాన్ని సుమారు గంట పాటు చదివి వినిపించారు. ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులు అందరూ బల్లలు చరిచి అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఉమ్మడి ఏపీతోసహా దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఈ సంప్రదాయం ఉన్నది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులే స్వయంగా 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గోవా సీఎం మనోహర్ పారికర్ జనవరి 30న బడ్జెట్ పెట్టగా.. ఈ నెల 8వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్ ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయా రాష్ర్టాల బడ్జెట్లను ప్రవేశపెట్టారు. చరిత్రను పరిశీలిస్తే.. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎంగా ఉంటూనే 1955-56, 1957-58 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ 1968-69, 1969-70 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 2010లో ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతూ 2010-11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, పద్దులను సభ్యులకు వివరించారు. ఇతర రాష్ర్టాల్లోనూ గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు అదనంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో 2015-16లో ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కేరళలో 2016-17లో సీఎం ఉమెన్‌చాందీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్‌లో సీఎం వసుంధర రాజే, నాగాలాండ్‌లో సీఎం సీకే సంగ్మా స్వయంగా 2018-19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

4884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles