జగదీశ్‌రెడ్డి గట్టి మనిషి : కేసీఆర్

Thu,October 4, 2018 07:23 PM

CM KCR praises on Minister Jagadish Reddy at Nalgonda TRS Meeting

నల్లగొండ : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. నల్లగొండ టీఆర్‌ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులన్నీ గోదావరి మీద ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. రామగుండం, భూపాలపల్లి, జైపూర్, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు కావొచ్చు. కానీ దక్షిణ తెలంగాణలో పవర్ ప్రాజెక్టులు లేవు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. బొగ్గు కూడాదొరకని రాయలసీమలో పవర్ ప్రాజెక్టు నిర్మించారు. నాడు నల్లగొండలో పవర్ ప్రాజెక్టు నిర్మించాలని ఏ నాయకుడూ కూడా నోరు మెదపలేదు. నల్లగొండలో పవర్ ప్లాంట్ పెట్టాలని అడిగిన చరిత్ర లేదు. జగదీశ్‌రెడ్డి.. జానారెడ్డి అంత ఎత్తు లేకపోవచ్చు.. ఉత్తమ అంతా పొడవు లేకపోవచ్చు. కానీ జగదీశ్ రెడ్డి గట్టి మనిషి. నల్లగొండలో ఒక పవర్ ప్రాజెక్టు పెట్టాలె అని కోరిండు. అల్ట్రా మెగా పవర్ ప్లాంట్.. జగదీశ్‌రెడ్డి తీసుకొచ్చిండు. దామరచర్ల వద్ద రూ. 29వేల 965 కోట్ల పెట్టుబడితో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. నల్లగొండ ముఖచిత్రం మార్చే దామరచర్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును కాంగ్రెస్ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏనాడూ పవర్ ప్లాంట్ కోసం పోరాటం చేయలేదు. ఈ ప్లాంట్ వల్ల 8 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కూడా బలపడుతారు అని సీఎం కేసీఆర్ అన్నారు.

2873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles