HomeLATEST NEWSCM KCR praises on Deputy Speaker Padma Rao Goud

పద్మారావుతో 20 ఏళ్ల అనుబంధం : సీఎం కేసీఆర్

Published: Mon,February 25, 2019 10:31 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన టీ పద్మారావుగౌడ్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుంచి పద్మారావుతో ఉన్న అనుబంధం మరిచిపోలేనిది అని తెలిపారు. రెండుసార్లు కార్పొరేటర్‌గా ఆయన ఎన్నికయ్యారు. కార్పొరేటర్ పదవి వదులుకొని 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావు. పద్మారావు ప్రజలతో మమేకమయ్యే తీరు అందరికి ఆదర్శం.

పరేడ్ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన తొలి సభకు రేయింబవళ్లు కష్టపడి పని చేసి ఆ సభను విజయవంతం అయ్యేలా పద్మారావు కృషి చేశారు. జంట నగరాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేయొద్దంటూ సమైక్య రాష్ట్రంలో ఆయన పోరాడారు. 2014లో పద్మారావు గౌడ్.. అబ్కారీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నగరంలో మళ్లీ కల్లు దుకాణాల పునరుద్ధరణ జరిగింది. మంత్రిగా పద్మారావు హయాంలో లక్షలాది ఈత, తాటి మొక్కలు నాటారు. కల్లుగీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేశారు. పదవిలో ఉన్నా లేకున్న ఆయన ఒకేలా ఉంటారు. భవిష్యత్‌లో పద్మారావు గౌడ్ మరిన్న ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
3795
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology