సీఎం జగన్‌ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

Mon,June 17, 2019 02:55 PM

CM KCR meets with CM Jagan at Tadepalli in Vijayawada

అమరావతి : విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. ఇరువురు సీఎంలు భోజనం చేసిన అనంతరం విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు. 9, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, పెండింగ్‌ బిల్లులు, ఇరు రాష్ర్టాల మధ్య నీటి వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు.

3400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles