ఏపీతో సత్సంబంధాలు నెలకొల్పుతాం: సీఎం కేసీఆర్

Sat,May 25, 2019 08:56 PM

CM KCR Meeting with YS jaganmohan reddy

హైదరాబాద్: జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతామని తెలిపారు. పొరుగు రాష్ర్టాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అనుసరిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంభిస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. గోదావరి, కృష్ణానది జలాలతో రెండు రాష్ర్టాలు సుభిక్షంగా ఉంటాయి. నేను స్వయంగా వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సమావేశమయ్యాను. మహారాష్ట్రతో ఉన్న జలవివాదాల వల్ల ప్రాజెక్టుల పనులు ఆగిపోవడంపై చోరువ తీసుకున్నాను. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పాను. వివాదాల పరిష్కరంగా రెండు రాష్ర్టాలకు మేలని చెప్పాను. మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అలాంటి విధానాలే కొనసాగిస్తాం. గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించొచ్చు. యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు నీళ్లు ఇవ్వవచ్చని తెలిపారు.

4396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles