గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం

Tue,August 28, 2018 08:23 PM

cm kcr meeting with the governor narasimhan

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్‌తో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారన్న ప్రచారం క్రమంలో ముఖ్యమంత్రి గవర్నర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటన విశేషాలను గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. స్థానికులకు ఉద్యోగావకాశాల కోసం రూపొందించిన జోనల్ విధానానికి ప్రధాని ఆమోదం తెలపడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొత్త జోనల్ విధానం అమలుకు నిబంధనల రూపకల్పన, హైకోర్టు విభజనకు జరుగుతున్న సన్నాహాలు వంటి అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజనపై కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్న విషయాన్ని వివరించారు.

2008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles