టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం

Thu,September 6, 2018 07:07 PM

cm kcr meeting with party assembly candidates

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని, టీఆర్‌ఎస్ పార్టీ చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. 31 జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలన్నారు. నవంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ప్రాచార కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి ఊరు, తండాలను వదల కుండా పర్యటనలను కొనసాగించాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.

5375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles