గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌

Sun,September 1, 2019 04:53 PM

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. నరసింహన్‌ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.


2009 డిసెంబర్ 29న ఆనాడు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి పంపించారు. జనవరి 23, 2010న ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్‌ను పూర్తికాలపు గవర్నర్‌గా నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 జూన్ 2014 నుంచి ఆయన రెండు తెలుగు రాష్ర్టాలకు గవర్నర్‌గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఏపీకి నూతన గవర్నర్‌ను నియమించగా.. అప్పటినుంచి నరసింహన్ తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.

2170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles