పాతబస్తీలో వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు: సీఎం

Mon,April 16, 2018 06:25 PM

cm kcr meeting on old city development in pragathi nagar with officials

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మైనార్టీ వ్యవహారాలు, పాతబస్తీ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్‌కే జోషి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పాతబస్తీలో రూ. వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో తానే శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాతబస్తీలో పర్యటించి అభివృద్ధి పనుల ప్రకటన చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వరదలకు ఆస్కారం లేకుండా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. పాతబస్తీ పనులపై సీఎస్ పక్షం రోజులకొకసారి సమీక్ష నిర్వహించాలన్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

1685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles