రేపు చింతమడకకు సీఎం కేసీఆర్

Sun,July 21, 2019 10:06 AM

cm kcr goes to chintamadaka tomorrow

సిద్దిపేట : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన స్వగ్రామం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి సోమవారం రానుండటంతో అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నది. సీఎం కేసీఆర్ పురిటిగడ్డకు వస్తుండటంతో చింతమడక గ్రామస్థులు సంబురంతో ఎదురు చూస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు సీఎం గ్రామంలోనే గడుపనున్నారు. ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలు చేయడానికి రెయిన్‌ప్రూఫ్ టెంట్లు వేశారు. గ్రామస్థులతో కలిసి సీఎం భోజనం చేస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5,500 మంది నుంచి ఆరు వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఇతర గ్రామాల ప్రజలు చింతమడకకు రాకుండా చర్యలు తీసుకొంటున్నారు.
గ్రామస్థులతో ఆత్మీయంగా గడుపుతారు: ఎమ్మెల్యే హరీశ్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామస్థులతో మమేకమయ్యే పర్యటన ఇది. ఇతరులు వచ్చి ఇబ్బంది పెట్టొద్దు. త్వరలోనే సిద్దిపేటలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల గృహప్రవేశాలు ఉన్నాయి. ఆరోజు అందరూ కలిసే అవకాశం ఉంటుంది. అందరూ సహకరించాలి అని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు కోరారు. శనివారం సాయంత్రం చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు చింతమడకతో ఎంతో అనుబంధం ఉన్నది. ఆయన ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా చింతమడక ప్రజలతో ఆత్మీయ, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. చింతమడక గ్రామ ప్రజల కోరికలన్నీ సీఎం కేసీఆర్ తీర్చబోతున్నారు. అని చెప్పారు. గ్రామంలో కలియదిరుగడంతోపాటు ఆలయాలను సందర్శిస్తారన్నారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు సన్నిహితులు, స్నేహితులు, ప్రజలతో ఆత్మీయంగా గడిపి వారితో కలిసి భోజనం చేస్తారని తెలిపారు.

1077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles