బడ్జెట్‌ గుణాత్మకం చూడాలి.. గణాత్మకం కాదు : సీఎం కేసీఆర్‌

Sat,February 23, 2019 12:39 PM

CM KCR give answer on Budget in Assembly

హైదరాబాద్‌ : ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. ప్రతిపక్షాలు కొత్త విషయాలు మాట్లాడితే బాగుండేది. నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలనే మరోసారి చెప్పారు. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సూచనలు, సలహాలు రాలేదు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. రూ. 80 వేల 200 కోట్లు సభ మంజూరు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్‌ విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని ఎక్కడా కూడా దాటలేదు. అప్పుల విషయంలో ఆర్‌బీఐ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రైవేటు అప్పుల్లా ఉండవు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే అప్పులు ఇస్తాయన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఐదారు రోజుల్లోనే రూ. 15 వేల కోట్ల అప్పులు ఇస్తామని పవర్‌ కార్పొరేషన్‌ ఇండియా లాంటి జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వాలు చిలిపి దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles