చంద్రబాబు అత్యంత డర్టీయెస్ట్ పొలిటిషియన్: సీఎం కేసీఆర్

Sat,December 29, 2018 07:00 PM

cm kcr fires on ap cm chandrababu in pragathi bhavan press meet

హైదరాబాద్: చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటిషియన్ ఈ దేశంలో ఎవరూ లేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఇవాళ సాయంత్రం సీఎం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు.

హైకోర్టును విభజించింది సుప్రీం.. కేంద్రం కాదు
రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అయింది. పార్లమెంట్ విడదీసింది. ఏ ముఖ్యమంత్రి అయినా వెంటనే హైకోర్టును మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడుకు మెదడున్నట్టా. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తదని బాబు అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడిన దానికి తలాతోక, అర్థంపర్థం ఉండదు. ఏపీ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేం ఆంధ్రాకు వెళ్లిపోతామని అఫిడవిట్.. సుప్రీంకు ఇచ్చింది. మేం కూడా ఇచ్చాం. అందుకే జనవరి 1 నుంచి రెండు కోర్టులు నడుస్తుయని చెప్పింది. ముందే ఎందుకు కోర్ట్ హాల్స్ తయారు చేయలేదు. హైకోర్టును విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు.. సుప్రీంకోర్టు. కేంద్రప్రభుత్వం దాన్ని నోటిఫై చేసింది. కేంద్రం మీద ఎట్ల ఆరోపణలు చేస్తవు నువ్వు. చంద్రబాబునాయుడు అంత డర్టీయెస్ట్ పొలిటిషియన్ ఈదేశంలో ఎవరూ లేరు. నువ్వు నవీన్ పట్నాయక్‌ను ఎందుకు కలిసినవు.. మల్లయ్య, ఎల్లయ్యను ఎందుకు కలిసినవు అని అడుగుతడు. నీకెందుకు అవసరమా.. నేను ఎవరిని కలిస్తే.

అప్పుడు మోడీ సంక.. ఇప్పుడు రాహుల్ సంక నాకుతున్నాడు
నాలుగేళ్లు మోదీ సంక నాకినవు. మోదీ ఒడిలో కూర్చున్నావు. అప్పుడు నువ్వు చెబితే మోదీకి డబ్బ కొట్టాలి మేం. నీకు ఉల్టా అయితే పోయి రాహుల్ గాంధీ సంక నాకుతవు. నువ్వు కాంగ్రెస్ సంక నాకగానే మేమంతా కాంగ్రెస్ వెంట రావాలా? ఏపీ ప్రజలకు చేతులెత్తి మొక్కాలె ఈ డర్టీ పొలిటిషియన్‌ను ఎలా భరిస్తున్నారో ఏమో.. పచ్చి అబద్ధాలు.. సిగ్గు పడాలి బాబు. మనిషికి సిగ్గు, లజ్జ ఉండాలి. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తది.. అవసరమే లేదని వాదించింది ఈ మనిషే కదా.

రాహుల్ గాంధీ.. ఎందుకు విజయవాడకు వస్తున్నడు. ఏం మొహం పెట్టుకొని వస్తున్నాడు. ఇంకా ఎందుకు బతికున్నమని చూసిపోవడానికి వస్తున్నాడా అన్నడు. తర్వాత నరేంద్ర మోదీ వస్తా అంటే.. ఏం మొహం పెట్టుకొని వస్తున్నాడు మోదీ అంటున్నాడు. నీకు ఒక పాలసీ, పద్ధతి ఉందా?


రాఫ్ట్ సిస్టమ్‌తో ఫౌండేషనట..
నిన్న ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చారు.. ఏపీ సెక్రటేరియెట్‌కు ఫౌండేషన్ వేశారట. అది రాఫ్ట్ సిస్టమ్‌తో ఫౌండేషన్ వేశారట. హైదరాబాద్‌లో రాఫ్ట్ టెక్నాలజీతో నిర్మించిన బిల్డింగ్‌లు వెయ్యి దాకా ఉన్నాయి. బలహీన వర్గాలకు కట్టించే ఇళ్లలో కూడా రాఫ్ట్ టెక్నాలజీనే. ఎక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడ రాఫ్ట్ సిస్టమ్‌తో నిర్మిస్తున్నాం. భగీరథలో ఉన్న ట్యాంకులు కూడా రాఫ్ట్ ఫౌండేషనే. చాలావరకు తెలంగాణలో కట్టే బిల్డింగ్‌లన్నీ రాఫ్ట్ ఫౌండేషనే. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న బిల్డింగులన్నీ రాఫ్ట్ ఫౌండేషనే. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తడు.

హరికృష్ణ శవం మీద చంద్రబాబు పేలాలు ఏరుకుతిన్నాడు..
అమాయకురాలు.. హరికృష్ణ బిడ్డను తీసుకొచ్చి కూకట్‌పల్లి నుంచి నిలబెట్టారు. హరికృష్ణ శవం మీద కూడా పేలాలు ఏరుకునే రాజకీయం చేశాడు చంద్రబాబు. హరికృష్ణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని గెలుద్దాం అనుకున్నాడు. అందుకే ఆయన కూతురును నిలబెట్టాడు. ఇప్పుడు ఆమెకు ఏమన్నా చేస్తాడా? ఆమెను పట్టించుకుంటాడా బాబు. హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి కూడా నెలన్నర అయింది. అప్పటి నుంచి ఎందుకు రెడీ కాలేదు. డర్టీ రాజకీయ నాయకులను మీడియా కూడా చీల్చి చెండాలి. కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటడు.. అని మాట్లాడుతున్నడు. కేశవరావు, కవిత, జితేందర్‌రెడ్డి.. ఇలా టీఆర్‌ఎస్ ఎంపీలంతా.. పార్లమెంట్ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారు. నేను కూడా వంద సార్లు చెప్పా. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రానికి లేఖ కూడా రాస్తా.

కేంద్రం నుంచి ఏపీకి సంవత్సరానికి 24 వేల కోట్లు వస్తున్నాయి..
రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 94లో ఉన్న 1, 2 ప్రకారం.. పరిశ్రమలకు సంబంధించిన రాయతీలు రెండు రాష్ర్టాలకు ఇస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పాం. పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రెండూ విడిపోయాక.. ఫైనాన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా.. వేణుగోపాల్ రెడ్డి రెండు రాష్ర్టాలకు వచ్చి రెండు రాష్ర్టాలను అధ్యయనం చేశారు. ఏపీకి కొంచెం లోటు బడ్జెట్ ఉందని.. ఏపీకి ఐదేళ్ల పాటు సంవత్సరానికి 24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి చెప్పాడు. ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు చంద్రబాబు.

బాబుకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రావు.. రెండు హిందీ ముక్కలు రావు
నువ్వే హోదా వద్దంటవు.. నువ్వే కావాలంటవు.. పచ్చి స్వార్థపరుడివి నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం ఏదైనా చేస్తవు. నీకు నీతి లేదు జాతి లేదు. నువ్వు దద్దమ్మవు. నీకు తెలివి లేదు. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని నడుపుతున్నావు నువ్వు. ఇద్దరు ఎంపీలతో నేను తెలంగాణ తీసుకొచ్చా. భారత ఫెడరల్ ఫ్రంట్ రావాలని నేను చెబుతున్నా. దాని కోసమే నేను నాయకులను, ప్రజలను కలుస్తున్నా. రైతు బాధలు తీర్చడానికి పెట్టిన రైతు బంధును ఇప్పుడు దేశం ఫాలో అవుతోంది. కల్యాణ లక్ష్మీ, ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినవు. చంద్రబాబుకు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ రాదు.. రెండు ముక్కలు హిందీ రాదు. నేషనల్ లేవల్‌లో పాలిటిక్స్ చేస్తాడా? డబ్బ పేపర్లు డబ్బ కొడుతున్నాయి తప్పితే.. చక్రం తిప్పింది లేదు.. వచ్చేది లేదు.

ఐటీలో కూడా చంద్రబాబునాయుడు పీకిందేమీ లేదు
బ్యాకప్ మెకానిజం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మెకానిజం అని రెండు ఉంటాయి. దేన్నయినా డెవలప్ చేస్తే.. దేన్నయినా కనిపెడితే అది నాశనం కాకూడదు. దానికి సంబంధించిన డేటాను సురక్షితంగా దాయడం కోసం వాడే మెకానిజాలే అవి. అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచం మొత్తంలో సేఫ్ జోన్ ఎక్కడుంటే అక్కడ వాటిని ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఐబీఎం స్టార్ట్ చేసింది. వాళ్లు ప్రపంచమంతా వెతుకుతుండగా హైదరాబాద్ కనిపించింది వాళ్లకు. రాజీవ్ గాంధీ పీఎంగా ఉన్నసమయంలో అది జరిగింది. వాళ్లు భూకంపాలు అతి తక్కువగా వచ్చే ప్రాంతం హైదరాబాద్ అని తెలుసుకున్నారు. తుపాను, సునామీ.. ఏదీ రాకుండా ఉండేది హైదరాబాద్ ఒక్కటే అని తెలుసుకొని వాళ్లే సెలక్ట్ చేసుకున్నరు హైదరాబాద్‌ను. రాజీవ్ గాంధీని వాళ్లు రిక్వెస్ట్ చేశారు. అప్పుడు జనార్ధన్‌రెడ్డి ఇక్కడ సీఎం. అప్పుడు రాజీవ్ గాంధీ.. జనార్ధన్‌రెడ్డిని పిలిచి.. దాని గురించి చెప్పారు. అలా... సైబర్ టవర్స్‌కు ఆధ్యులు రాజీవ్ గాంధీ, జనార్ధన్‌రెడ్డి అయ్యారు. సైబర్ టవర్స్‌కు పునాది వేసింది ఎం జనార్ధన్‌రెడ్డి. స్వాభావిక, భౌగోళిక అడ్వాన్టేజ్ వల్ల హైదరాబాద్‌కు ఐటీ వచ్చింది కానీ.. చంద్రబాబు వల్ల కాదు. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. కానీ.. మేమెప్పుడూ బాకా కొట్టుకోలేదు. డబ్బాలు కొట్టలేదు మేము. రాష్ట్రం, దేశం డబ్బా కొడుతం కానీ.. మాకు మేం డబ్బా కొట్టుకోం. ఎన్ని రోజులు నువ్వు మోసం చేస్తవు. హైదరాబాద్‌కు ఐటీ నేను తీసుకొచ్చినా అని చంద్రబాబు ఎలా డప్పాలు కొడుతున్నాడు.. అంటూ సీఎం కేసీఆర్ వెల్లడించారు.

4185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles