3 లక్షల కోట్ల అప్పుందని రుజువు చేస్తారా? : సీఎం కేసీఆర్‌

Sat,September 14, 2019 01:41 PM

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడంపై కేసీఆర్‌ స్పందించారు. ఈ రాష్ర్టానికి మూడు లక్షల కోట్ల రూపాయాల అప్పు ఉందా? దీన్ని రుజువు చేస్తారా? విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే మంచిది. లేని దాన్ని ఉన్నట్టు.. 2 లక్షల కోట్ల అప్పును మూడ లక్షల కోట్ల అప్పుగా చూపిస్తే ఊరుకుంటామా? రుజువు చేస్తారా? ఇలాంటి అవాస్తవాలు మాట్లాడొద్దు. 2 లక్షల కోట్లు కూడా లేని అప్పును మూడు లక్షల కోట్లు అని చెప్పడం సరికాదు.


ఈ రాష్ట్రంలో మీకు అభివృద్ధి కనబడడం లేదా? ఒక్క ప్రాజెక్టు కూడా మీకు కనబడడం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైమ్‌లో కడితే మీకు కనిపిస్తలేదా? భక్తరామదాసు ప్రాజెక్టును ఒక్క ఏడాదిలో పూర్తి చేశాం. ఇది కనబడుత లేదా? ఈ ప్రాజెక్టు ఉన్నది మీ జిల్లాలోనే కదా? లక్ష్మీ బ్యారేజీని ఇప్పటి వరకు 20 లక్షల మంది చూశారు. కళ్లున్న కబోదుల్లాగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తప్పుగా, అబద్దాలు మాట్లాడితే అడుగడుగునా అడ్డుకుంటాం. సభలో అందరం సమానమే. ప్రతిపక్షమనే వంకతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. కాంగ్రెస్‌ది ఐదేళ్లుగా ఇదే ధోరణి. ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టినా మీ తీరు మారలేదు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

3775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles