ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

Sat,February 23, 2019 11:03 AM

CM KCR fire on Congress MLA Sridhar Babu in Assembly

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదని, కాంగ్రెస్‌ పార్టీ వల్లే 24 గంటల కరెంట్‌ సాధ్యమైందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో ఆరాచకం సృష్టిస్తోందని పేర్కొన్నారు. శ్రీధర్‌ బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. శ్రీధర్‌బాబు సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదనడం అబద్ధమన్నారు. గ్రామపంచాయతీలకు 40 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గ్రామాల్లో మీ హయాంలో కొనసాగిన ఆరాచకాన్ని భవిష్యత్‌లో కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అద్దాల్లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తామని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. గ్రామాల్లో పన్నులు వసూలు చేయిస్తాం. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వంద శాతం వసూలు చేయిస్తాం. మంచినీళ్లు ఇస్తాం. పంచాయతీరాజ్‌ యాక్ట్‌ చదివితే బాగుంటుందని శ్రీధర్‌బాబుకు సీఎం సూచించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సోలార్‌ విద్యుత్‌ లేనే లేదు. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 40 నెలల్లో కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను నిర్మించినం. తమ ప్రభుత్వ హయాంలో 3600 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. సోలార్‌ పవర్‌ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉందని తెలిపారు. విద్యుత్‌ తలసరి వినియోగంలో రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని వెల్లడించారు. పంచాయతీలను పటిష్టం చేసేందుకే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తీసుకువచ్చామన్నారు. ఆరాచక వ్యవస్థకు అంతం పలికి.. ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు.

5113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles