అరాచక శక్తులను సహించం : సీఎం కేసీఆర్

Tue,March 13, 2018 10:29 AM

CM KCR fire on congress leaders in assembly

హైదరాబాద్ : రాష్ట్రంలో అరాచక శక్తులను సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి దురదృష్టకరం, బాధాకరం. శాసనసభలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిన్నటి ఘటన కాంగ్రెస్ సభ్యుల అరాచకాలకు పరాకాష్ట అని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తున్నారు. తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. చీప్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ సభ్యులు పాల్పడుతున్నారు.

నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. అరాచక శక్తులను ప్రోత్సహించం. రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోం. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పలుసార్లు చెప్పాం. ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబు కాదన్నారు.

సభా హక్కులకు భంగం కలిగించొద్దని సీఎం సూచించారు. కాంగ్రెస్ నేతలే నాటకాలు ఆడుతున్నారు. తమకు నాటకం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సభలో కూర్చుంటే వచ్చది ఏమీ లేదు. ఎలాగైన బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం సమయంలో దాడి చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని సీఎం చెప్పారు. రాజకీయాల్లో ఇంత అసహనం పనికి రాదన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.

2818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS