జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? : సీఎం కేసీఆర్Tue,March 13, 2018 11:16 AM

జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : శాసనసభలో సీఎం కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ నుంచి జానారెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదు అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. నిన్న జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? మా దగ్గర రిపోర్టులు లేవా? ఉట్టిగానే సస్పెండ్ చేస్తామా? జానారెడ్డిపై తమకు గౌరవం లేదా? అని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న జరిగిన ఘటనను కిషన్‌రెడ్డి సమర్థించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తామంతా మౌనం పాటించాలా? అని అడిగారు.

ప్రజా జీవితంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు అని పేర్కొన్నారు. జానారెడ్డిని అందరికంటే ఎక్కువగా గౌరవించింది తానేనని సీఎం స్పష్టం చేశారు. సిద్ధాంతాలను వీడి ఏకమవుతామంటే తాము చేసేదిమీ లేదన్నారు. 2/3 సభ్యుల ఆమోదంతో సభ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. సభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి సభ్యుడు గౌరవించాలని కోరారు. అటువైపు ఉన్న ముగ్గురు సభ్యులు సభ నడిపిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇటువైపు ఉన్న 90 మంది సభ్యులు మాట్లాడకుండా ఉండాలా? అని సీఎం కేసీఆర్ అడిగారు.

6842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS