ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి సీఎం కేసీఆర్ మద్దతు

Mon,June 19, 2017 02:41 PM

హైదరాబాద్ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవిద్ కు సీఎం కేసీఆర్ మద్దతు తెలిపినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవిద్‌ను ఎంపిక చేసినట్లు కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా తెలిపారు.

ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడుతూ.. ఒక దళిత నాయకుడిని రాష్ర్టపతిగా ఎంపిక చేయాలని మీరు సూచించారు. మీ సూచన మేరకు దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నాను, మీ పూర్తి మద్దతు కోరుతున్నాను అని మాట్లాడారు. తక్షణమే సీఎం కేసీఆర్ పార్టీ నేతలను సంప్రదించారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు ప్రధాని విజ్ఞప్తి మేరకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్‌ను ఎంపిక చేసినట్లు మోదీ ఫోన్‌లో తెలిపారు.2544

More News

మరిన్ని వార్తలు...