సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ఇదే..!

Tue,September 25, 2018 10:20 PM

cm kcr election campaign schedule released

హైద‌రాబాద్‌: నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి, వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని గులాబీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు సైతం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడిస్తున్న విష‌యం తెలిసిందే. 90 శాతానికిపైగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థి పార్టీలను కంగుతినిపించిన కేసీఆర్.. ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారు కాకముందే మొదటిదశ ప్రచారాన్ని పూర్తిచేయాలని అధినేత కేసీఆర్ నిర్ణ‌యించారు.

ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. సభలన్నింటికీ టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసింది.

కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

1. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బహిరంగ సభ
2. అక్టోబర్ 4న నల్లగొండలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బహిరంగ సభ
3. అక్టోబర్ 5న వనపర్తిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బహిరంగ సభ
4. అక్టోబర్ 7న వరంగల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా బహిరంగ సభ
5. అక్టోబర్ 8న ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బహిరంగ సభ

6685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles