మిషన్‌ కాకతీయ, చిన్న నీటి వనరులపై సీఎం సమీక్ష

Fri,February 15, 2019 06:09 PM

cm kcr do review on mission kakatiya

హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ, చిన్న నీటి వనరుల సంరక్షణపై సీఎం కేసీఆర్‌ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు.. ఏవీ కూడా వృథా కావొద్దని.. అన్ని నీళ్లు నేరుగా చెరువులకు చేరేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ మేరకు వారంరోజుల్లోగా సమగ్ర నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. చెరువులన్నీ నిండి కళకళలాడితనే మిషన్‌ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లవుతుందన్నారు. ఒకప్పుడు కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు బాగా పండేవన్నారు. బచావత్‌ అవార్డు ప్రకారం 1974లోనే మన చెరువులకు 265 టీఎంసీల కేటాయింపు ఉండేదన్నారు. రానురాను చెరువులు, తెలంగాణ బతుకు నాశనం అయిందన్నారు. రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోరు వేసినా పంటలు పండలేదన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపాలని సూచించారు. వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు కూడా కిందనున్న చెరువులకు నేరుగా పోవాలని వెల్లడించారు. గొలుసుకట్టు మొదటి చెరువు నుంచి మిగతావాటికి నీరందేలా ఫీడర్‌ కెనాల్స్‌ నిర్మించాలని చెప్పారు. చెరువులు, చెక్‌ డ్యాముల్లో నీటినిల్వ సామర్థ్యాన్ని సరిగ్గా లెక్కించాలని సీఎం పేర్కొన్నారు.

1312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles