సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లుThu,October 12, 2017 05:51 PM
సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

సూర్యాపేట: సూర్యాపేట పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రభుత్వం స్థానికంగా ఉన్న గొల్లబజార్‌లో 192 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధ్యక్షతన నిన్న లాటరీ పద్దతిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఇవాళ పట్టాల పంపిణీ జరిగింది. లబ్దిదారుల చేత సీఎం సామూహిక గృహప్రవేశం చేయించారు. కాసేపట్లో సూర్యాపేట ప్రగతి సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.

891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS