1962కు డయల్ చేసిన సీఎం కేసీఆర్

Fri,September 15, 2017 06:31 PM

cm kcr dial 1962 toll free number

హైదరాబాద్ : రైతు ప్రతినిధిగా, పశు పోషక ప్రతినిధిగా ప్రతి లబ్దిదారుణ్ణి తన హృదయంలో చూసుకుంటున్న సీఎం కేసీఆర్.. టోల్‌ఫ్రీ నెంబర్ 1962కు కాల్ చేశారు. సంచార పశు వైద్యశాలల ప్రారంభం సందర్భంగా సభా వేదికపై నుంచి 1962కు అధికారులు దగ్గరుండి ఫోన్ చేసి సీఎంతో మాట్లాడించారు. ఎంత సేపట్లో మా వద్దకు రాగల్గుతారని సీఎం ప్రశ్నించగా.. మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్ అని కాల్‌సెంటర్ వారు అడగడంతో.. సీఎం మాట్లాడుతూ.. ఇక్కడ పశువు లేదమ్మా.. ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం అని సమయస్ఫూర్తితో మాట్లాడి సభలో నవ్వులు పూయించారు.

సీఎం కేసీఆర్‌కు, కాల్ సెంటర్ వారి మధ్య సంభాషణ
కాల్ సెంటర్ : నమస్తే.. పశు ఆరోగ్య సేవ 1962కు మేము ఏ విధంగా సహయపడగలం సార్..చెప్పండి సార్..
సీఎం కేసీఆర్ : మీరు ఏస్టేషన్ నుంచి మాట్లాడుతున్నారమ్మా?
కాల్ సెంటర్ : చెప్పండి సార్
సీఎం కేసీఆర్ : అమ్మా మీరు ఎక్కడున్నారు? ఎంత సేపట్లో రాగల్గుతారు?
కాల్ సెంటర్ : 30 నిమిషాల్లో రాగల్గుతారు.. మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్
సీఎం కేసీఆర్ : ఇక్కడ పశువు లేదమ్మా.. ఇది ప్రారంభోత్సవం.. కంగ్రాజులేష్యన్స్ గో హెడ్ అంటూ సీఎం ఫోన్ పెట్టేశారు.
కాల్ సెంటర్ : ధన్యవాదములు సార్.. 1962 నెంబర్‌కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు సార్..

4197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles