మద్దూరి వెంకటేశ్వర శివైక్యం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Wed,September 19, 2018 12:39 PM

CM KCR Condolence to Madduri Venkateshwara Yajulu death

హైదరాబాద్ : సుప్రసిద్ధ వేతశ్రౌత విద్వాంసులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆగమ సలహాదారు బ్రహ్మాశ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులు(95) శివైక్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. శతాధిక సోమ, స్మార్త యాగాల్ని ఆచరించిన విఖ్యాత యజ్ఞ పురుషులు.. తెలుగు వారంతా గర్వించదగ్గ విఖ్యాత ఆహితాగ్నిగా ఆయన సుపరిచితుడని సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం కేసీఆర్. ఈ నెల 12న వెంకటేశ్వర యాజులు తన కుటుంబ సభ్యులతో కలిసి చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. మంగళవారం బద్రీనాథ్ క్షేత్రంలో అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర యాజులుకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. యాజులు పార్థివదేహాన్ని బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. సైదాబాద్ మహాప్రస్థానంలో అంత్యేష్టి నిర్వహించనున్నారు.

1706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles